Monday, April 13, 2009

గున్నమామితోటలో
గుండె ఊసు చెప్పాలని
కోయేలమ్మ పాటకి
కంటి రెప్ప విప్పాలని
నీలికల్లలో కదలాడే
ఏదో ఆర్దత
తొంగి చూసే
నాఎద లోయలో భావుకత
బతుకు వీణపై ఆనంద
భైరవి ఆలపించాలని
పైరగాలిలా పదముల
పయనం సాగాలని
పెదవికోమ్మపై నవ్వుల
పువ్వులే మొగ్గతోడ గాలని
పలుకు పలుకులో
సంతోషమే చినుకు
చినుకు గ కురవాలని
చిన్ని గుండెలోcహేలరేగే
చిలిపి అల
కంటి పాప వెనుక
దాగే ఓ కన్నె కల